ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, చేపట్టిన పనుల్లో విజయం | Sakshi
Sakshi News home page

Horoscope Today in Telugu: ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, చేపట్టిన పనుల్లో విజయం

Published Sun, Dec 10 2023 6:59 AM

Horoscope Today 10 12 2023 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.త్రయోదశి తె.5.45 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి చతుర్దశి, నక్షత్రం: స్వాతి ఉ.10.41 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: సా.4.31 నుండి 6.07 వరకు,

దుర్ముహూర్తం: ప.3.58 నుండి 4.46 వరకు,
అమృతఘడియలు: రా.2.26 నుండి 4.01 వరకు;
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు,
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు,
సూర్యోదయం: 6.23,
సూర్యాస్తమయం: 5.22.
 


మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పనులు చకచకా సాగుతాయి.

మిథునం: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కన్య: వ్యయప్రయాసలు. పనులలో స్వల్ప ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. 

తుల: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో చర్చలు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

వృశ్చికం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. దైవదర్శనాలు.

ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. పాతమిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

Advertisement
 
Advertisement