ఈ రాశివారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు

Daily Horoscope In Telugu 21th July 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.ద్వాదశి ప.2.36 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం జ్యేష్ఠ సా.5.38 వరకు, తదుపరి మూల వర్యం రా.1.09 నుండి 2.37 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుండి 12.30 వరకు అమృతఘడియలు... ఉ.9.26 నుండి 10.55 వరకు.

సూర్యోదయం :    5.38
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:
మేషం: ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు.

వృషభం: బంధువుల నుంచి  శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పనులు
చకచకా సాగుతాయి. 

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

సింహం: వ్యవహారాలు ముందుకు సాగవు. రుణాలు చేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు,  ఉద్యోగాలలో నిరాశ. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు.

కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు.

తుల: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. రుణఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ప్రయాణాలు వాయిదా.

వృశ్చికం: యత్నకార్యసిద్ధి.  మిత్రులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. 

ధనుస్సు: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ కొంత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. కళాకారులకు ఒత్తిడులు.

మకరం: నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

కుంభం: ఇంటాబయటా ప్రోత్సాహం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. క్రీడాకారులకు మంచి గుర్తింపు.

మీనం: మిత్రులతో వివాదాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి  చిక్కులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top