గ్రహం అనుగ్రహం (21-11-2020)  | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (21-11-2020) 

Published Sat, Nov 21 2020 5:56 AM

Daily Horoscope In Telugu (21-11-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.సప్తమి రా.1.44 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం శ్రవణం ప.2.34 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం సా.6.38 నుంచి 8.17 వరకు, దుర్ముహూర్తం ఉ.6.11 నుంచి 7.40 వరకు అమృతఘడియలు... తె.4.32 నుంచి 5.44 వరకు (తెల్లవారితే ఆదివారం).

సూర్యోదయం :    6.12
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

వృషభం: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: కుటుంబంలో చికాకులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం. దూరపు బంధువుల కలయిక. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. ఉద్యోగాలలో  ఆశలు నెరవేరతాయి. 

సింహం: అనుకోని ధన లాభాలు. విద్యాప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కన్య: ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

తుల: చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమా«ధిక్యమే. మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

వృశ్చికం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు. మిత్రుల నుంచి సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. 

మకరం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరం.

కుంభం: వ్యవహారాలు కొన్ని  నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో వివాదాలు.

మీనం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

Advertisement
Advertisement