గ్రహం అనుగ్రహం (20-11-2020)  | Daily Horoscope In Telugu (20-11-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (20-11-2020) 

Nov 20 2020 6:48 AM | Updated on Nov 20 2020 6:48 AM

Daily Horoscope In Telugu (20-11-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.షష్ఠి రా.1.55 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ ప.2.21 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం సా.6.22 నుంచి 8.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.23 నుంచి 9.10 వరకు, తదుపరి ప.12.06 నుంచి 12,51 వరకు అమృతఘడియలు... ఉ.8.03 నుంచి 9.34 వరకు.

సూర్యోదయం : 6.11
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం : నూతనోత్సాహం. పట్టుదల పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృషభం : సన్నిహితులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం : వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కర్కాటకం : శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం : పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య : విద్యార్థులకు కొంత నిరాశ. పనుల్లో గందరగోళం. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.

తుల : వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం : కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.

ధనుస్సు : వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మకరం : పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం : సన్నిహితులతో అకారణంగా విరోధాలు. అనుకోని ప్రయాణాలు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం : పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement