ఈ రాశివారి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా

Daily Horoscope In Telugu 12 May 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.పాడ్యమి రా.1.21 వరకు, తదుపరి విదియ, నక్షత్రం కృత్తిక రా.1.19 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం. ప.11.58 నుంచి 1.45 వరకు, దుర్ముహూర్తం ప.11.31 నుంచి 12.22 వరకు, అమృతఘడియలు... రా.10.35 నుంచి 12.22 వరకు. 

సూర్యోదయం :    5.33
సూర్యాస్తమయం    :  6.18
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

రాశి ఫలాలు: 

మేషం: దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. విద్యార్థులకు ఒత్తిడులు.

వృషభం: వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం.

మిథునం: ప్రయాణాలు వాయిదా. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యం.

కర్కాటకం: కార్యక్రమాలు  విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కన్య: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. మానసిక అశాంతి. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.

తుల: వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుస్తారు. ప్రయత్నాలు మందగిస్తాయి. కార్యక్రమాలలో అవరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం: అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

ధనుస్సు: వ్యూహాలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు.

మకరం: కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. అనారోగ్యం.

కుంభం: కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యలతో విభేదాలు. దైవచింతన. భూవివాదాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

మీనం: కార్యజయం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి లాభం. వాహనయోగం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top