పశువీర్య ఉత్పత్తిలో నంద్యాలదే అగ్రస్థానం 

Semen Testing Centre Centre In Kurnool - Sakshi

సాక్షి, బొమ్మల సత్రం(కర్నూలు): పశుజాతి అంతరించిపోతున్న ఈ రోజుల్లో నాణ్యమైన వీర్యాన్ని అందించి పశువులను ఉత్పత్తి చేయడంలో నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రం కీలకం పాత్ర పోషిస్తుంది. ఏడాదికి 10 లక్షల నుండి 20 లక్షల వరకు డోస్‌ల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ సంస్థలో 10 జాతుల పశువులను వీర్యాన్ని సేకరించి భద్రపరిచి అవసరమైన  జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలో కూడా ఈ కేంద్రం నుండి వీర్యాన్ని సరఫరా చేస్తున్నారు.

నంద్యాల పశుగణాభివృద్ధి సంస్థ, ఘనీకృత వీర్యకేంద్రంపై సాక్షి ప్రత్యేక కథనం. పట్టణంలోని కడప – కర్నూలు జాతీయ రహదారి పక్కన నూనెపల్లెలోని  15.27 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ పశుగణనాభివృద్ధి సంస్థ, ఘనీకృత వీర్యకేంద్రం ఉంది. ఈ కేంద్రం 1976 సంవత్సరం డిసెంబర్‌ 7వ తేదీన నంద్యాలలో ప్రారంభించారు. ఈ ఘనీకృత వీర్య కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో పాటు ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌లు, సిబ్బంది పని చేస్తున్నారు. 15.27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఘనీకృత వీర్య కేంద్రం 5 ఎకరాలలో భవనాలు ఉండగా 10.27 ఎకరాలలో ఆబోతులకు కావాల్సిన సూపర్‌ నేపియర్, కాకిజొన్న, గనిగడ్డి లాంటి నాణ్యమైన పశుగ్రాసాన్ని పండిస్తున్నారు.

వీర్య నాశికలను సరైన సమయంలో ఉత్పత్తి చేసి సరఫరా చేయడం. నిరంతరం వీర్య నాణ్యతను పరిశీలిస్తూ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా సూచించిన మినిమం స్టాండెడ్స్‌ ప్రోటోకాల్‌ను పాటించడం ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం.1982లో ఘనీకృత పశువీర్యాన్ని నంద్యాలలోనే ఉత్పత్తి చేయడం ప్రారంభించి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరఫరా చేశారు. 2000 సంవత్సరంలో ఈ కేంద్రం అభివృద్ధి చెంది ఆంధప్రదేశ్‌ పశుగణనాభివృద్ధి సంస్థలో చేర్చారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రంలో పలుజాతుల పశువుల నుంచి వీర్యాన్ని సేకరించి భద్రపరుస్తారు.

ఇక్కడ ఉన్న ఆబోతులను బయోసెక్యూలర్‌ జోన్‌లో ఉంచి వాటికి క్రమం తప్పకుండా టీకాలు వేసి ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ ఘనీకృత వీర్యకేంద్రంలో తయారు చేసిన వీర్యనాశికలు మన రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కేరళ, కలకత్తా, భోపాల్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.

నాణ్యమైన వీర్య ఉత్పత్తి ఇలా..
ఒక్కొక్క వీర్యనాశికలో 0.25 ఎంఎల్‌ వీర్యం ఉంటుంది. అందులో దాదాపుగా 2 కోట్ల వీర్యకణాలు ఉంటాయి. వీర్యంను సేకరించిన తర్వాత దానిని పరీక్షించి భద్రపరుస్తారు. ఉత్పత్తి చేసిన వీర్యంతో పశువుకు గర్భదారణ చేసిన అనంతరం పశువు అనారోగ్యానికి గురి కాకుండా చూస్తారు. వీర్యంలో నిర్దేశించిన కణాల శాతం కచ్చితంగా ఉండేలా చూస్తారు. ఆబోతులు అనారోగ్యానికి గురి కాకుంగా పలుజాగ్రత్తలు తీసుకుంటారు. అనంతరం ఈ వీర్యాన్ని విశాఖపట్నంలోని ఆండ్రాలజీ ల్యాబోరేటరీకి పంపి నాణ్యతను పరీక్షించి అనంతరం ఇక్కడ నుండి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. 

సంస్థ సాధించిన విజయాలు..
2007 సంవత్సరంలో మానిటరింగ్‌ యూనిట్‌చే నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేయడంలో ఏగ్రేడ్‌ సాధించింది. 2010లో బీగ్రేడ్‌ను సాధించింది. 
2013సంవత్సరంలో సెంట్రల్‌ మానిటరింగ్‌ యూనిట్‌ వారు నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రానికి ఏగ్రేడ్‌ రెండవ సారి ప్రధానం చేశారు. ఈ సంవత్సరంలోనే నంద్యాల నుండి జేకే ట్రస్టు ద్వారా అదిలాబాద్,
మెదక్, నిజామాబాద్‌లతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బాసరా, తమిళనాడు రాష్ట్రాలకు వీర్యనాశికులు సరఫరా చేసింది. 
2016–17 సంవత్సరంలో సెంట్రల్‌ మానిటరింగ్‌ యూనిట్‌ వారిచే మూడవసారి నాణ్యమైన వీర్య ఉత్పత్తిలో ఏగ్రేడు సాధించింది. 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top