పవిత్ర కార్తీక మాసం రానే వచ్చింది. నెల రోజుల ‘శివ లీల’కు శైవక్షేత్రం ముస్తాబైంది. శివుడు కొలువైన పచ్చని కొండాకోన పంచాక్షరి నామంతో ప్రతిధ్వనించనుంది. కార్తిక దీప శోభితంతో ప్రతి శివాలయమూ వెలుగుమయం కానుంది. కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ | - | Sakshi
Sakshi News home page

పవిత్ర కార్తీక మాసం రానే వచ్చింది. నెల రోజుల ‘శివ లీల’కు శైవక్షేత్రం ముస్తాబైంది. శివుడు కొలువైన పచ్చని కొండాకోన పంచాక్షరి నామంతో ప్రతిధ్వనించనుంది. కార్తిక దీప శోభితంతో ప్రతి శివాలయమూ వెలుగుమయం కానుంది. కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

● అమృతేశ్వరా.. అభయమివ్వరా

మదనపల్లెసిటీ: జిల్లాలోని శైవ క్షేత్రాలు కార్త్తిక మాస ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. ఈ నెలంతా కార్తిక దీప శోభతో అలరారనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని తంబళ్లపల్లె మల్లయ్యకొండలో వెలసిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయం, మదనపల్లెలోని యోగభోగేశ్వరస్వామి ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయం, సీటీఎంలోని గెవిగుండలోని గంఽగాధరస్వామి ఆలయం, నిమ్మనపల్లె మండలం తవళంలో వెలసిని నేలమల్లేశ్వరస్వామి ఆలయం, రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయం, పుంగనూరులోని పుండరీకాక్ష ఆలయం, కలకడ ఝరి ఆలయాలతో పాటు నిత్యపూజకోన, ఒంటిమిట్టలోని ముకుంద మల్లేశ్వరస్వామి, పొలతల శ్రీ మల్లికార్జునస్వామి తదితర శైవక్షేత్రాల్లో కార్తిక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సోమవారాలకు ప్రత్యేక స్థానం

కార్తిక మాసోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉద యం అభిషేకాలు, అలంకారాలు, విశేష పూజలు, సర్వదర్శనం నిర్వహిస్తారు. ప్రత్యేకించి ప్రతి సోమ వారం ఆలయాల్లో ప్రత్యేక పూజోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో నాలుగు సోమవారాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 24న కార్త్తిక పౌర్ణ మి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement