ఇక పల్లె పోరు ! | - | Sakshi
Sakshi News home page

ఇక పల్లె పోరు !

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

● ఈ నెల 13 నుంచి డిసెంబర్‌ 2 దాకా ఎన్నికల ప్రక్రియ

● జిల్లాలో 411 సర్పంచు, 4,230 వార్డు పదవులకు ఎన్నికలు

● పోటికి సిద్ధమవుతున్న అభ్యర్థులు

● పార్టీలకతీతంగా అభ్యర్థుల ఎన్నిక

● జిల్లాలో మహిళా ఓటర్లు అధికం

సాక్షి, మదనపల్లె: మున్సిపాలిటీ, జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు ముగిసిపోగా, ఇప్పుడు పార్టీలకు అతీతంగా నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. పంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయ వేడి రాజుకోనుంది. ప్రధానంగా సర్పంచ్‌ పదవులకు పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చే అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. దీనికోసం పార్టీల మద్దతు కోసం అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిషత్‌ ఎన్నికలు ఒక విధానంలో జరిగితే, పంచాయతీ ఎన్నికలు పూర్తి విరుద్ధంగా జరుగుతాయి. స్థానిక అభ్యర్థుల వ్యక్తిగతం, ప్రజలకు ఉపయోగపడే అవకాశాలను గుర్తించడం ద్వారా ప్రజలు వారిని ఆదరించే పరిస్థితులు ఉంటాయి. దీనికి పార్టీల మద్దతు ఉంటుంది కాబట్టి అభ్యర్థుల గెలుపు అవకాశాలపై రాజకీయ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. నవంబర్‌ 13న జరిగే ఎన్నికల తొలి నోటిఫికేషన్‌ నుంచి డిసెంబర్‌ రెండు వరకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని చర్యలు పూర్తి చేయడంతో ఎన్నికల నిర్వహణకు సిద్దమయ్యారు.

4,304 పోలింగ్‌ కేంద్రాలు

మదనపల్లె డివిజన్‌లో 2,058, పీలేరు డివిజన్‌లో 1,372, రాయచోటి డివిజన్‌లో 874 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి దశ ఎన్నికలు జరిగే రాయచోటి డివిజన్‌లో తక్కువ మండలాలు ఉండటంతో తొలి విడతలో పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, పుంగనూరు మండలాలను కలిపి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, వసతులు, ఇతరా పనులను ఇప్పటికే చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement