మదనపల్లె టౌన్ : భూ వివాదంలో ఓ వ్యక్తిపై ప్రత్యర్థులు ఇటుకలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ముదివేడు పంచాయతీ సద్దికూటివారిపల్లెలో చోటు చేసుకుంది. బాధితుడు ముదివేడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాల.. గ్రామానికి చెందిన ఎస్. శ్రీనివాసులు కుమారుడు ఎస్. దామోదర్ (30) తమకు చెందిన స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఎస్. వేణు, సుధాకర్లు సదరు భూమి తమదేనంటూ అడ్డుపడటంతో పాటు కోర్టులో కేసు వేశారని ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు తాము వారి వద్దకు వెళ్లగా... ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేణు, సుధాకర్ ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దామోదర్‌ను చికిత్స ని మిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపారు.


