పోలింగ్‌ సిబ్బంది ఆకలి కేకలు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సిబ్బంది ఆకలి కేకలు

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

పీలేరు : ఎన్నికల విధులకు హాజరైన పోలింగ్‌ సిబ్బంది ఆకలికేకలతో అలమటించారు. పోలింగ్‌ సామగ్రి తీసుకెళ్లడానికి బుధవారం స్థానిక సంజయ్‌గాంధీ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాచిన పలువురు సిబ్బంది ఆకలితో అలమటించారు. దగ్గరలో ఎలాంటి హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు లేకపోవడం, ఎన్నికల అధికారులు ఎలాంటి భోజన వసతి ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు వెయ్యి మంది సిబ్బంది రాగా, మధ్యాహ్నం ఏర్పాటుచేసిన భోజనం సగం మందికి కూడా సరిపోలేదు. మిగిలిన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement