సదుం: స్థానిక ఎన్నికలలో వైఎస్సార్ సీపీని ఆదరించాలని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటరు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కోరారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన పర్యటించారు. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి పుట్రాజు, ఎంపీటీసీ అభ్యర్థి షాహిదాను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు పలువురు కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలతో ఎన్నికలలో గెలుపొందాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారని ఆయన చెప్పారు. వారి కుట్రలను ప్రజలు ఆమోదించరని, ప్రజాభిమానం వైఎస్సార్ సీపీకే ఉందని స్పష్టం చేశారు. ప్రజలు నిర్భయంగా ఎన్నికలలో పాల్గొనాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిన సంగతి అందరూ గుర్తించారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అభివృద్ధి ఊసే లేకుండా పోయిందని అన్నారు. పార్టీ అభ్యర్థులకు మండలంలో భారీ మెజార్టీ చేకూరేలా చూడాలన్నారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తే వైఎస్సార్ సీపీ సత్తా ఎంటో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి నిహాంత్ రెడ్డి, సయ్యద్‌బాషా, మస్తాన్, ఖాజాపీర్, ఇందాద్, వెంకటరమణా రెడ్డి, రమేశ్, విజయ్ రెడ్డి, ఎల్లారెడ్డి, మల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రమేశ్ రెడ్డి, షబ్బీర్, భాస్కర్, చిన్నరమణ, కాలేషా, వెంకటస్వామి, శివారెడ్డి, ఉషారాణి, రాజశేఖర్, నవీన్, రమణారెడ్డి, ఖమ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


