వాటర్‌ గ్రిడ్‌ పనుల పురోగతిపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ గ్రిడ్‌ పనుల పురోగతిపై సమీక్ష

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

సాక్షి, మదనపల్లె: జిల్లాలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనుల పురోగతిపై కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మంగళవారం గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈల, డీఈలతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. పురోగతిలోని పనుల స్థితిని, వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలపై అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర తాగునీటి సరఫరాకు అవసరమైన ఓహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణాలను వచ్చే మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రారంభం కాని క్లియర్‌ వాటర్‌ సంపుల నిర్మాణాలను ప్రారంభించి, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పూర్తయితే తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతమై, నీటి రవాణా అవసరం ఉండదన్నారు. శాఖల మధ్య సమన్వయంపై కలెక్టర్‌ సమీక్షించారు. అవసరమైన అనుమతులు, శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుని, పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కోరారు. సమావేశంలో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఎస్‌ఈ శ్రీధర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సతీష్‌ కుమార్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement