ఎన్నికల ప్రచారంలో విషాదం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో విషాదం

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

● వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి

● బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపీ పరామర్శ

పుంగనూరు : స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం సాగుతున్న వేళ మంగళవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని యల్లారుబైలు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త వై.నరసింహారెడ్డి(59) ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న వ్యక్తి ఒక్కసారిగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు ఫోన్‌ ద్వారా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వైఎస్సార్‌సీపీ నాయకులకు పోలీసుల నోటీసులు

కలికిరి : మండలంలోని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులకు బెదిరింపులే లక్ష్యంగా.. పోలీసులు మంగళవారం నోటీసులు అందజేశారు. సాధారణంగా నేర చరిత్ర కలిగిన, గతంలో ఎన్నికలలో అల్లర్లకు పాల్పడిన వారికి ముందస్తుగా నోటీసులు అందజేసి.. ఈ ఎన్నికలలో ఎలాంటి తగాదాలకు పాల్పడకూడదని బైండోవర్‌ చేస్తారు. అయితే గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా.. కేవలం వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారనే సమాచారంతో నోటీసులు అందజేసి.. భయభ్రాంతులకు గురిచేయడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వైఎస్సార్‌సీపీ నాయకులకు మాత్రమే నోటీసులు అందజేయడం, ఫోన్‌లు చేసి హెచ్చరించడం.. పోలీసుల ఏకపక్ష ధోరణికి అద్దం పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement