కడప సెవెన్‌రోడ్స్ : సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్ల ద్వారా డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి తప్పుడు మెసెజ్‌లకు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటన ద్వారా ప్రజలను కోరారు. తాజాగా తన పేరుతో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా డబ్బులు అడుగుతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫేక్ అకౌంట్ల రిక్వెస్టులకు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మెసెజ్‌లు ఎవరికై నా వస్తే కలెక్టర్ కార్యాలయంలో తెలియజేయాలని తెలిపారు. సైబర్ నేరాలపై జిల్లా సైబర్ పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచిందని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు.
సామాజిక మాధ్యమాల్లో
మనీ రిక్వెస్టులను నమ్మొద్దు
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


