కడప ఎడ్యుకేషన్ : కర్నూలులో జరిగిన అండర్ 17 బాలబాలికల స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పోల్ వాల్ట్ ఈవెంట్‌లో కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగన్నపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థులు సాహిదా, ముబీనా ప్రతిభ చాటి జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారని వ్యాయాయ ఉపాధ్యాయుడు శివశంకర్‌రెడ్డి తెలిపారు. ఇందులో సాహిదా 2 మీటర్లు ఎత్తు దూకి బంగారు పతకం, ముబీనా 1.85 మీటర్ల ఎత్తు దూకి వెండి పతకం సాధించారు. విజేతలు నవంబర్ 19 నుంచి 23 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురిలో జరిగే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.


