లెక్క తేలేది నేడే | - | Sakshi
Sakshi News home page

లెక్క తేలేది నేడే

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం పుంగనూరు రోడ్‌ లోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల దాకా మదనపల్లె పట్టణంలో పోలింగ్‌ నిర్వహించారు. 144 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు చేపట్టిన అనంతరం బ్యాలెట్‌ పత్రాలు ఉన్న బాక్సులను ఆదివారం రాత్రి ఇదే కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌ లో భద్రపరిచారు. వీటిని మంగళవారం ఉదయం కౌంటింగ్‌ హాల్లోకి తరలించి బ్యాలెట్‌ పత్రాలను లెక్కించనున్నారు.

● ఓట్ల లెక్కింపు కోసం జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌, మదనపల్లె మున్సిపల్‌ సహాయ ఎన్నికల అధికారి ప్రమీల ఏర్పాట్లను సిద్ధం చేశారు. పోలైన 71,924 ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కించడం కోసం కౌంటింగ్‌ టేబుల్‌ సిద్ధం చేశారు. చైర్మన్‌ బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు కోసం 25 టేబుళ్లు, వార్డు బ్యాలెట్ల లెక్కింపు కోసం 47 టేబుల్‌ లను సిద్ధం చేశారు. వీటికి సంబంధించి చైర్మన్‌ బ్యాలెట్‌ ను రెండు రౌండ్లలో లెక్కించి పూర్తి చేయనున్నారు. వార్డు బ్యాలెట్‌ కు సంబంధించి మూడు రౌండ్లలో లెక్కించి ఫలితం ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు. లెక్కింపు సమయాన్ని బట్టి ఫలితం ప్రకటించడం జరుగుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

కుర్చీ ఎవరిదో..!

మదనపల్లె చైర్మన్‌ కుర్చీ ఎవరిది అన్నది మంగళవారం తేలిపోనుంది. గత నెల 16న నామినేషన్ల ప్రక్రియ జరిగి, ఈనెల 1న ( ఆదివారం) చైర్మన్‌ పదవికి (పాతికేళ్ల తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక) ఎన్నిక నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున జింకా వెంకటా చలపతి చైర్మన్‌ అభ్యర్థిగా, 47 వార్డులకు కౌన్సిల్‌ అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం కోసం రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి శాయశక్తులా కృషి చేశారు. క్యాడర్‌ ను ఎన్నికలకు సిద్ధం చేసి, స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతలు ఇంటింటి ప్రచారాలు, కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా మున్సిపాలిటిలో పార్టీ ఓడిపోని చరిత్ర ఉన్నందున ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తమవుతోంది. కాగా మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో టీడీపీ ప్రజా మద్దతుతో గెలిచింది లేదు. అయితే అధికారం అండతో ఈ ఎన్నికలలో గెలవాలని టీడీపీ అడ్డదారులతో ప్రయత్నాలు చేసింది. పార్టీ అభ్యర్థి శ్రీరామ్‌ కుమార్‌ తరపున మంత్రులు, పార్టీ నేతలు ప్రచారాలు నిర్వహించారు.

● ఆదివారం జరిగిన మదనపల్లె మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో 1,16,958 మంది ఓటర్లు ఉండగా అందులో 71,924 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 61.50 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఎవరి లెక్కలు వారివి ..

బీసీ జనరల్‌ కేటగిరీతో చైర్మన్‌ పదవికి 9 మంది పోటీలో ఉన్నా వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు ప్రధానంగా పోటీపడ్డారు. గత ఎన్నికల్లో 35 ఉన్న మున్సిపల్‌ వార్డులు ఈసారి 48కి పెరిగాయి. దాంతో వార్డుల స్వరూపం మారిపోయింది. పాత ఒక వార్డు పరిధి కొత్తగా ఏర్పాటయిన మూడు, నాలు గు వార్డుల్లోకి చేరింది. దీని కారణంగా అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల వ్యూహాలకు కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రచారం, ఓటింగ్‌ సమయం కూడా ఎక్కువగా లేకపోవడం అభ్యర్థు లకు కొంత ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఈ పరిస్థితుల్లో చైర్మన్‌ అభ్యర్థులు ఎవరికి వారు పార్టీ, వర్గ బలాబలాలపై అంచనాలు, లెక్కలు వేసుకుంటున్నారు.

మదనపల్లె ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

చైర్మన్‌ ఓట్లకు 25, వార్డు ఓటర్లకు 47 టేబుళ్లు

కుర్చీపై ఎవరి లెక్కలు వారివి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement