మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లి సమీపంలో సోమవారం ప్రత్యర్థులు ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు, తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా వెంకటాపురం ఎగువ తడకరకు చెందిన నీరజాక్షులు పిళ్లై కుమారుడు రాజేష్(40) ను అంకి శెట్టిపల్లి రోడ్డు లోని సమాధుల తోట దగ్గరకు అంకిశెట్టిపల్లెకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, లోకేష్ లు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు కరల్రతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు అపస్మారక స్థితికి చేరడంతో, చనిపోయాడని భావించి నిందితులు రాజేష్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. నిర్మానుష్య ప్రదేశంలో పడి ఉన్న బాధితుడిని స్థానికులు గమనించి మానవత్వం చాటుకున్నారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ప్రధమ చికిత్సలు అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పాత కక్షలే కారణమా లేక మహిళ లేదా ఆడపిల్ల విషయమై ఈ ఘటన జరిగిందా అనే కోణంలో తాలూకా సీఐ మహమ్మద్ రఫీ బాధితుడిని అస్పత్రిలో పరిశీలించి విచారణ చేపట్టారు. గాయపడిన బాధితుడు మదనపల్లె చంద్రా కాలనీకి సమీపంలో ఉన్నమంజునాథ కాలనీలో తన తల్లి వద్ద ఉంటూ దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు ప్రాధమిక దర్యాప్లు తేలిందని పోలీసులు తెలిపారు. మరన్ని వివరాలను నిందితులు పట్బుడ్డ అనంతరం వెల్లడించాల్సి ఉంది.


