ట్రాక్టర్‌, కారు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌, కారు ఢీకొని వ్యక్తి మృతి

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

వాల్మీకిపురం : పట్టణ శివారు ప్రాంతంలోని బోగంపల్లి రిజర్వాయర్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ట్రాక్టర్‌, కారు ఢీకొనడంతో.. ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జర్రావారిపల్లి వడ్డిపల్లికి చెందిన డ్రైవర్‌ లోకనాథ్‌(32) ఇసుక ట్రాక్టర్‌ను తీసుకొని మదనపల్లికి బయల్దేరాడు. కర్ణాటక రాష్ట్రం గౌరీ బిదునూరుకు చెందిన నందిని(33), నాగలత(30) తిరుపతికి వెళ్లి తర్వాత కారులో గౌరీబిదునూరుకు తిరుగుపయనమయ్యారు. మార్గంమధ్యలోని బోగంపల్లి రిజర్వాయర్‌ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రాక్టర్‌ ఢీకొనడంతో.. ట్రాక్టర్‌ డ్రైవర్‌ లోకనాథ్‌ ట్రాక్టర్‌ వెనుకచక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న నందిని, నాగలతకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నందిని తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ

రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు లోకనాథ్‌ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. త్వరతిగతిన పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అందించాలని డాక్టర్లను కోరారు. ఆయన వెంట నాగార్జున, రాజాబాబు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement