ప్రశ్నించిన చైర్మన్‌ అభ్యర్థిపై దాడి | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించిన చైర్మన్‌ అభ్యర్థిపై దాడి

Nov 2 2026 2:23 AM | Updated on Nov 2 2026 2:23 AM

ప్రశ్నించిన చైర్మన్‌ అభ్యర్థిపై దాడి

సాక్షి, మదనపల్లె / సాక్షి నెట్‌వర్క్‌: మదనపల్లె పట్టణంలో మున్సిపల్‌ ఎన్నిక పోలింగ్‌ ఉద్రిక్తతల నడుమ జరిగింది. పోలింగ్‌ ప్రారంభానికి కేంద్రాల్లో అందరు అభ్యర్థుల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించాక పోలింగ్‌ను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా 16వ పోలింగ్‌ కేంద్రంలోనికి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించకుండానే మాక్‌ పోలింగ్‌ నిర్వహణ విషయం తెలుసుకున్న ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి జింకా వెంకటా చలపతి కేంద్రం వద్దకు చేరుకుని అధికారులను ప్రశ్నించారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తారా అని నిలదీశారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న రామాపురం ఎస్‌ఐ శివకుమార్‌ కలుగజేసుకుని వాదనకు దిగారు. జింకాపై లాఠీతో కొట్టి నెట్టడంతో ఆయన కిందపడి స్పృహ కోల్పోయే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ పోలీసులు జింకాను పైకెత్తుకుని కేంద్రం నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డి, సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌ జింకాను పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జింకా తనపై జరిగిన దాడి పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం జింకా జిల్లా ఆస్పత్రికి వె వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement