చౌడేపల్లె : భార్యాభర్తల మధ్య చెలరేగిన మనస్పర్థల కారణంగా వారం రోజులుగా మాట్లా డుకోవడం మానేయడంతో.. మనస్తాపం చెంది వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం జరిగింది. మండలంలోని గడ్డంవారిపల్లె మార్గంలో గల యానాది కాలనీకి చెందిన వెంకటరమణ, మల్లిక దంపతులు ఒకే ఇంటిలో నివసిస్తున్నప్పటికీ.. కుటుంబ కలహాల కారణంగా ఒకరినొకరు మాట్లాడుకోవడం మానేశారు. ఈ క్రమంలో వెంకటరమణ విషపు పసరుగడ్డలు తిని ఆత్మహత్యకు యత్నించగా భార్య మల్లిక విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ చౌడేపల్లె 108 వాహనం ద్వారా మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
7న ఎస్‌జీఎఫ్ కబడ్డీ
జిల్లా జట్ల ఎంపికలు
మదనపల్లె సిటీ : ఎస్‌జీఎఫ్ కబడ్డీ అండర్–17 బాలబాలికలు, అండర్–10 బాలికల జిల్లా జట్ల ఎంపికలు ఈనెల 7వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు తెలిపారు. పుంగనూరు బీఎంఎస్ క్లబ్‌లో ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్సు, స్పోర్ట్సు కిట్ తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు పీడీ జ్యోతిలక్ష్మి సెల్ నంబర్ 944094507ను సంప్రదించాలని వివరించారు.


