అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లెలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఎకై ్సజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ సీఐ వై.బాబు ఆదివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా డీపీఈవో ఆదేశాల మేరకు మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీ బృందం, ఎస్టీఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా మదనపల్లె నుంచి అంగళ్లు వెళ్లే రోడ్డులోని స్థానిక టమోటా మార్కెట్‌ యార్డు ఎదుట వాహన తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ తనిఖీల్లో నీరుగట్టువారిపల్లెకు చెందిన ఎన్‌.భాస్కర్‌రెడ్డి (46) అక్రమంగా 15 బాటిళ్ల మద్యాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 2.7 లీటర్ల మద్యాన్ని (11 బిన్నీస్‌ గ్రేప్‌ బ్రాందీ, 4 ఓల్డ్‌ అడ్మిరల్‌ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, క్రైం నం.102/2026 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు.

బైక్‌ అదుపు తప్పి

యువకుడికి గాయాలు

చౌడేపల్లె : చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని చిన్నకొండామర్రి వద్ద రోడ్డుకు అడ్డుగా ఆవు రావడంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపు తప్పి పడి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముళబాగిల్‌ మండలంచీక్‌ పల్లెకు చెందిన పవన్‌ బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. బంధువులను చౌడేపల్లెలో వదలడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన అతన్ని చౌడేపల్లె 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కడప కార్పొరేషన్‌ ఎన్నిక రద్దు చేయాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : కడప నగర పాలక సంస్థ ఎన్నికలను తక్షణమే రద్దు చేసి, సీఆర్‌పీఎఫ్‌ బలగాలను రప్పించి 361 పోలింగ్‌ కేంద్రాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌ బాషా, వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్‌ చెరుకూరికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడప నగరంలోని 361 పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేసుకున్నారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను కొట్టి తరిమేసి సైక్లింగ్‌కు పాల్పడ్డారన్నారు. ఓటర్లను రానీయకుండా గేట్లు మూసేసి టీడీపీ నాయకులు రిగ్గింగ్‌ చేసుకునేందుకు పోలీసులు సహకరించారని ఆరోపించారు. కాంగ్రెస్‌, సీపీఐ, ఎంఐఎం, బీఎస్పీ ఏజెంట్‌ ఫారాలను టీడీపీ వారే తీసుకున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement