ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలు

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

సోమల(సదుం) : ఎన్నికలలో ఓటమి తప్పదనే భయంతోనే టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. సోమల మండలం కందూరులో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్తులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థి సాంబశివయ్య, ఎంపీటీసీ అభ్యర్థులు మనీలా, వసంతమ్మను గెలిపించాలని కోరారు. ఎన్నికలలో తమ అక్రమాలకు అడ్డు ఉండకుండా ఉండేలా ముందుగానే పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు అక్రమ కేసులు బనాయించేలా ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. అయినా అటువంటి వాటికి బెదరక పార్టీ శ్రేణులు ధైర్యంగా పోరాడుతున్నారని అభినందించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, తమ కుటుంబం ఎళ్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఓటర్లు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మోహన్‌, గంగాధర రాయల్‌, ప్రభాకర, ఈశ్వరయ్య, బాషా, నాగేశ్వరరావు, వెంకటరమణ, సురేష్‌, సీఎల్‌పీ రెడ్డి, చిన్నారెడ్డి, మల్లికార్జున రెడ్డి, పుష్పావతి, సౌజన్య, హరీష్‌, ఉమాశంకర్‌, మురళీ, రామ్‌కుమార్‌, శివకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement