పోలింగ్‌కు వెళ్లిన మహిళలపైనా దాడులు దారుణం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు వెళ్లిన మహిళలపైనా దాడులు దారుణం

Nov 2 2026 2:17 AM | Updated on Nov 2 2026 2:17 AM

ప్రొద్దుటూరు : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చనిపోయిందని, ఇంతటి అరాచకం, అన్యాయం మునుపెన్నడూ జరగలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. చివరికి పోలింగ్‌కు వెళ్లిన మహిళలపై కూడా దాడులు చేయడం రాష్ట్ర ఆవిర్భావం నుంచి చూడలేదన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం తన క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలింగ్‌ రోజున జరిగిన ఈ దాడి అప్రజాస్వామికం, అన్యాయమని.. అఘాయిత్యాన్ని ప్రజలందరూ అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ పరిస్థితులను చూస్తే ప్రజాస్వామ్యం ఇంకా జీవించి ఉందంటారా అని ప్రశ్నించారు. వ్యవస్థలన్నీ కలసి ఇలా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తారని, అలాంటి ఎన్నికలు ఇంతటి అధ్వాన పరిస్థితుల్లో జరిగితే ఏమి చెప్పాలన్నారు. వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనవని, అవే లేకుండా చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుందన్నారు. పోలింగ్‌ ఏజెంట్లను బయటికి లాగి ఓటు వేసేందుకు వెళ్లిన మహిళలపై కూడా దాడులు చేశారన్నారు. సాధారణంగా మహిళలు ఓటు స్లిప్‌ తీసుకుని ఓటు వేసేందుకు వెళతారని, కట్టెలు తీసుకొని వచ్చారని అధికారులు చెబుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి దారుణమైన పరిస్థితిని ప్రజలు చూసి ఉండరన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement