మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరుపుతున్న దుకాణ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారని మదనపల్లె ఒకటో పట్టణ సీఐ మోహనకుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిబంధనల ప్రకారం అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పట్టణ పరిధిలోని మద్యం దుకాణాలను సీజ్ చేసి మద్యం విక్రయాలపై జిల్లా కలెక్టర్ ఎస్పీల ఆదేశాలతో ఎకై ్సజ్ సీఐ భీమలింగ నిషేధం విధించారు. అయితే స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న నాగా వైన్స్‌వద్ద గోప్యంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎకై ్సజ్, ఒకటో పట్టణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను కవరేజ్ చేస్తున్న కొంత మంది పాత్రి కేయులపై దుకాణ యజమాని దాడికి పాల్పడ్డాడు. పోలీసుల ఎదుటే ద్విచక్రవాహనంతో ఢీకొట్టి చంపుతానని బెదిరించాడు. దీంతో గాయపడిన పాత్రికేయు డు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు నాగా వైన్‌న్స్ యజమాని నాగరాజ నాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బాధితుడి ఫిర్యాదుతో దుకాణ
నిర్వాహకుడిపై కేసు నమోదు


