పుంగనూరు : వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌గుర్తుపై ఓట్లు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని భీమగానిపల్లి, సింగిరిగుంట, కుమ్మరనత్తం గ్రామాల్లో జెడ్పిటిసి అభ్యర్థి వెంకటరమణతో కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కరపత్రాలు పంపిణీ చేశారు.గ్రామాల్లో ప్రజలు, మహిళలు కలసి పెద్దిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. దళారీల బెడద లేకుండా సంక్షేమ పథకాలు అన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలు గెలిచి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రెండో సారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తెలుగుదేశం అరాచకాలకు, ఆగడాలను ఎదుర్కొని, వారికి తగిన గుణపాఠం నేర్పాలని, లేకపోతే పుంగనూరులో శాంతి నశించిపోతుందని సూచించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి అనీషారెడ్డి, కార్యదర్శి శ్రీనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


