ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయండి | - | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయండి

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

తంబళ్లపల్లె : మండలంలో 5వతేదీ జరగబోయే జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎద్దులవారిలపల్లె ఎంపీటీసీ అభ్యర్థి ఎ.భూదేవి భర్త చలపతినాయుడిపై కేసు పెట్టి జైలుకు పంపారు. అయినా ఆమె మొక్కవోని ధైర్యంతో భర్త లేకున్నా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఇంటింటా ప్రచారం నిర్వహించడం విశేషం. గడపగడపకు వెళుతూ ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కన్నెమడుగు ఎంపీటీసీ అభ్యర్థి లీలావతి భర్త రవిశంకర్‌రెడ్డిలు భూదేవికి మద్దతుగా ఎద్దులవారిపల్లె సెగ్మెంట్లో ప్రచారం చేశారు. కోసువారిపల్లె ఎంపీటీసీ అభ్యర్థి హరికుమార్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు,అభిమానులతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రేణుమాకులపల్లె పంచాయతీలో కన్నెమడుగు ఎంపిటీసీ అభ్యర్థి లీలావతి ఇంటింటా ప్రచారం చేస్తూ ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు. తంబళ్లపల్లెను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమాలలో నాయకులు రెడ్డప్పరెడ్డి, మహమ్మద్‌అలీ, వెంకట్‌రెడ్డి, అమరనాథరెడ్డి, సత్తార్‌సాహెబ్‌, రెడ్డినారాయణ, లోకేశ్వరరెడ్డి, ఎరుకల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రమణారెడ్డి, రాజారెడ్డి, వెంకట్‌రెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement