రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

ట్రిపుల్‌ ఐటీల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు

ములకలచెరువు : మండలంలోని దేవులచెరువు జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు. అండర్‌–14 పోటీలకు ఎనిమిదో తరగతి విద్యార్థి లక్ష్మీకాంత్‌ ఎంపికయ్యాడు. కురబలకోట జెడ్పీ హైస్కూల్‌లో పోటీలు నిర్వహించగా లక్ష్మీకాంత్‌ సత్తా చాటాడు. ఉపాధ్యాయులు లక్ష్మికాంత్‌ను శుక్రవారం అభినందించారు.

హ్యాండ్‌బాల్‌ పోటీలకు...

రామసముద్రం : మండలంలోని అరికెల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని దీపిక రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 27న మదనపల్లెలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్‌–17 బాలికల హ్యాండ్‌బాల్‌ జట్టు ఎంపికల్లో దీపిక ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికై నట్లు హెచ్‌ఎం వెంకటాచలపతి తెలిపారు. తెనాలిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు కె.ఎన్‌. ఉదయ్‌ కుమార్‌ అభినందించారు.

వేంపల్లె : రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలలో 311 మంది ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీయూకేటీ వైస్‌ చాన్స్‌లర్‌ మద్యాల లక్ష్మీనారాయణరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీని సందర్శించారు. అనంతరం అక్కడ ఉన్న కంప్యూటర్‌ ల్యాబ్‌లు, భోజనశాలలు, ఆగిపోయిన ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీల అభివృద్ధికి సుమారు రూ.200 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయన్నారు. ట్రిపుల్‌ ఐటీల భవన నిర్మాణాలు, అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంబంధించి నిధులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి రత్నకుమారి, పీఆర్‌ఓ బాషా, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement