పాఠశాల 30 ఏళ్ల రికార్డులు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

పాఠశాల 30 ఏళ్ల రికార్డులు దగ్ధం

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

గాలివీడు : మండలంలోని పందికుంట ఎంపీయూపీ పాఠశాలకు సంబంధించిన సుమారు 30 ఏళ్ల రికార్డులు దగ్ధం చేసిన ఘటన కలకలం రేపుతోంది. గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో పాఠశాలలోని అడ్మిషన్‌ రిజిస్టర్లు, ఇతర కీలక రికార్డులు మంటల్లో దగ్ధం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న వలంటీర్‌ వెంటనే గాలివీడు మండల విద్యాశాఖ అధికారి(ఎంఈఓ)కి తెలియజేసినట్లు సమాచారం. అయితే ఆ అధికారి ఇప్పటి వరకు పాఠశాలను సందర్శించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ప్రవేశ వివరాలు, పాఠశాల నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లు, గత మూడు దశాబ్దాల విద్యా చరిత్రకు సంబంధించిన రికార్డులు దగ్ధం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రికార్డుల దగ్ధం వల్ల భవిష్యత్తులో విద్యార్థుల ధ్రువీకరణ, పాత వివరాల పరిశీలన వంటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఘటనపై విచారణ చేపట్టాలని, రికార్డులు ఎలా దగ్ధమయ్యాయో గుర్తించాలని, మిగిలి ఉన్న రికార్డులను భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు పాఠశాల రికార్డుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement