సంబేపల్లె : మండల పరిధిలోని నారాయణరెడ్డిగ్రామం ముదినేనివాండ్లపల్లెకు చెందిన చల్లా వెంకటరమణ(60) బావిలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. ముదినేనివడ్డిపల్లెలోని రామాలయంలో పూజారిగా చల్లా వెంకటరమణ ఉండేవాడు. గురువారం ఉదయం నుంచి ఆయన కనపడక పోవడంతో బంధువులు గ్రామమంతా వెతికారు. ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ.. శుక్రవారం గ్రామ సమీపంలోని బావిలో పూజారి మృతదేహన్ని గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే సంబేపల్లె పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూజారికి పెళ్లి కాలేదు.


