మదనపల్లి(కురబలకోట) : మదనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి టీఎ.పీర్బాషాకు ఓటు వేసి గెలిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సయ్యద్ రహీమ్ ఓటర్లను కోరారు. ఇప్పటికే వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇండియా కూటమి నాయకులు పట్టణంలో విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తూ కుండ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో బాస్ వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్, సీపీఎం నాయకులు శ్రీనివాసులు, వీసీకే పార్టీ నాయకులు ముత్తాల మోహన్, పాలకుంట శ్రీనివాసులు, సీపీఐ నాయకులు తోట కృష్ణప్పతోపాటు తెట్టు శ్రీనివాసులు, సొన్నికంటి రెడ్డెప్ప, గిన్నెల మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


