ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల భవనాలను బుధవారం ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి సీసీ కెమెరాల నిఘా, కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తు, ఏజెంట్లకు అవసరమైన మౌలిక వసతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి , డీఎస్పీ బి.ప్రసాద్‌, కమిషనర్‌ ప్రమీల, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement