నాడు అందుబాటులో.. నేడు అందనంత ఎత్తులో.. | - | Sakshi
Sakshi News home page

నాడు అందుబాటులో.. నేడు అందనంత ఎత్తులో..

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

● వైఎస్సార్‌సీపీ హయాంలో ధరల

నియంత్రణ భేష్‌

● కూటమి పాలనలో సగటుజీవి విలవిల

● రెండేళ్లలోనే 11 నుంచి 83 శాతం పెంపు!

నాడు పాలకుల చిత్తశుద్ధితో..

వంటింట్లో అన్నం ముద్దలు అందుబాటులో!

నేడు కూటమి పాలనలో..

సగటుజీవి బతుకంతా అందనంత ఎత్తులో!

చంద్రబాబు చెప్పిన ‘సంపద సృష్టి’..

నింగికి చేరిన ధరల మంటాయె!

దళారుల దోపిడీ రాజ్యానికి..

సామాన్యుడి కడుపుకోతే సాక్ష్యమాయె!

కేవలం రెండేళ్ల కాలంలోనే...

11 నుండి 83 శాతం పెరిగిన ధరల భారం!

కూలీల నుంచి ఉద్యోగుల వరకు...

కడుపులు మాడ్చుకుంటున్న నవ్యాంధ్ర చిత్రం!

మదనపల్లె సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సంపదను సృష్టిస్తాం’ అంటూ పదేపదే చెప్పుకునే గొప్పలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. సంపద సృష్టి సంగతి దేవుడెరుగు కానీ, నిత్యం వాడే సరుకుల ధరలనైనా తగ్గించాలంటూ సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఓవైపు రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండించే అన్నదాతలకు తమ ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర లభించక అల్లాడిపోతున్నారు. ఇదే అదనుగా మార్కెట్‌లో దళారులు రంగప్రవేశం చేసి అటు రైతులను, ఇటు వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయలేక, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలు నింగికి చేరాయి. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలకు తోడు రోజువారీ వాడే బియ్యం, కందిబేడలు, చింతపండు, మిర్చి తదితర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సరుకుల ధరల్లో ఏ చిన్న మార్పు వచ్చినా ఆ పెను ప్రభావం నేరుగా సామాన్యుడిపైనే పడుతోంది. చంద్రబాబు చెప్తున్నట్లుగా ఇటు కొత్తగా సంపద సృష్టి లేక, అటు కష్టించి సంపాదించిన దాంట్లో ఉన్నదంతా వంటింటి సరుకులకే సరిపోక.. ఎలాంటి మిగులు లేక జనాలు సతమతమవుతున్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో చిత్తశుద్ధి..

కూటమి పాలనలో అగమ్యగోచరం!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌, పటిష్టమైన ధరల నియంత్రణ నిధి వంటి చర్యల వల్ల నిత్యావసరాల ధరలు ఎప్పుడూ అదుపులోనే ఉండేవి. ఆనాడు ప్రభుత్వ పర్యవేక్షణ గట్టిగా ఉండటంతో సామాన్య జనాలు ప్రశాంతంగా, కడుపునిండా పట్టెడు అన్నం తినగలిగారు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిత్యావసర సరుకుల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే మార్కెట్‌లో ధరల పెరుగుదల అమాంతం 11 శాతం నుండి 83 శాతానికి పైగా పెరగడం గమనార్హం. ఆనాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో పాలకులకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి నేటి పాలకుల్లో లోపించడమే ఈ విచ్చలవిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. పర్యవేక్షణ లేని ఈ మార్కెట్‌ మంట సగటు మనిషి జీవన విధానాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.

బతుకు దయనీయంగా మారింది..

నిత్యావసర సరుకుల ధరలు అమాతంగా పెరిగాయి. దీంతో అన్ని వర్గాలకు చెందిన ప్రజల బతుకు దయనీయంగా మారింది. ఇక సామాన్యుల పరిస్ధితి అయితే మరీ ఘోరం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ధరలను అదుపు చేయాలి.

– బావానాయక్‌, ప్రశాంత్‌ నగర్‌, మదనపల్లె

ధరలు పెరిగాయి, ఆదాయం తగ్గింది..

ఒకవైపు అనూహ్యంగా ధరలు పెరిగాయి, మరో వైపు ఆదాయ మార్గాలు పూర్తిగా తగ్గాయి. దీంతో పేదలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరుకుల ధరలు అందుబాటులో ఉంటేనే ఎవరైనా కొనగలరు.. తినగలరు. ధరలు ఆకాశంలో ఉంటే ఆర్థిక స్తోమత కలిగిన వారు కూడా ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు.

– జమృత్‌ బాష, సీటీఎం, మదనపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement