ఫేక్‌ ఫోన్‌పే మోసాలు: కేటుగాడి కోసం గాలింపు | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఫోన్‌పే మోసాలు: కేటుగాడి కోసం గాలింపు

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

మదనపల్లె టౌన్‌ : ఫేక్‌ ఫోన్‌ పే స్క్రీన్‌ షాట్‌ లతో వ్యాపారులను మోసం చేస్తున్న యువకుడి కోసం మదనపల్లె, బి. కొత్తకోట పోలీసులు గాలింపు చేపట్టారు. మదనపల్లె వన్‌ టౌన్‌ సీఐ మోహన్‌ కుమార్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఇతని వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్‌ స్టేషన్‌ లేదా వన్‌ టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతూ ఒక ఫోటోను విడుదలచేశారు. మదనపల్లె, బి. కొత్తకోట తదితర ప్రాంతాల్లో ఉండే వ్యాపారులను గూగుల్‌ పే, ఫోన్‌ పే పేమెంట్‌లతో మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ పేర్కొన్నారు. ఎవరికై నా అనుమానం వస్తే వెంటనే తమకు ఫోన్‌ చేయాలని కోరారు. డబ్బు తమ ఖాతాకు వచ్చిందో లేదో ఖాతాలో నిర్ధారించుకుని, స్క్రీన్‌ షాట్‌ లను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement