సమష్టిగా ఎదుర్కొందాం.. విజయం సాధిద్దాం | - | Sakshi
Sakshi News home page

సమష్టిగా ఎదుర్కొందాం.. విజయం సాధిద్దాం

Oct 29 2026 1:48 AM | Updated on Oct 29 2026 1:48 AM

వాల్మీకిపురం : నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డగించి దాడులు చేసిన టీడీపీ నాయకుల నియంతృత్వ వైఖరిని ధైర్యంగా ఎదుర్కొని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి విజయం సాధిద్దామని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సాయినగర్‌లోని సాయికల్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పురపాలక సంఘ, స్థానిక సంస్థల ఎన్నికలను అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అభ్యర్థులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కలిసి కట్టుగా వెళ్లి తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసేలా అడగాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు, దాడులను రాష్ట్రంలోని ప్రజలతో పాటు దేశం మొత్తం చేస్తోందన్నారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వంపై ఇంకా వ్యతిరేకత పెరిగిందన్నారు. గత ప్రభుత్వంలో సీఎంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల అమలే మనం ఇప్పుడు ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి ఓట్లు అడగటానికి దోహదం చేస్తున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏ వస్తువు కొనాలన్నా ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికార బలం, ధన బలంతో భయపెట్టి, బెదిరించి రాజకీయంగా తమకు దక్కాల్సిన స్థానాలను అధికార పార్టీ నాయకులు దూరం చేశారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులు శాశ్వతం కాదని, భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారుతాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంపల్లి రమేష్‌, లక్ష్మీనారాయణ రెడ్డి, ద్వారకనాథరెడ్డి, రెడ్డి అర్జున్‌ రెడ్డి, వేమనారాయణ రెడ్డి, రెడ్డెప్ప రెడ్డి, మెంబర్‌ శీనా, మునిభాస్కర, గౌతమ్‌ నాగార్జున, రాంనాథం, సోమశేఖర్‌ రెడ్డి, సంజీవ్‌ రెడ్డి, క్రిష్ణాంజనేయులు, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

పార్టీ శ్రేణులకు చింతల రామంద్రారెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement