మదనపల్లె సిటీ : 70వ ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల,బాలికల వాలీబాల్,హాకీ జట్ల ఎంపికలు బుధవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, బీటీ కాలేజీ మైదానాల్లో జరిగాయి. వాలీబాల్ అండర్ –19 బాలుర విభాగంలో విభాగాల్లో జిల్లా నలుమూలల నుంచి బాల, బాలికలు పాల్గొన్నారు. హాకీ అండర్ –14 బాల,బాలికల జట్లకు ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు సుమారు 260 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకరులు త్వరలో కాకినాడలో జరిగే రాష్ట స్థాయి పోటీలలో పాల్గొంటారని ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేష్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ సభ్యులు అరుణ, భార్గవి, జలజ, నాగరాజు, నరేష్‌బాబు పాల్గొన్నారు.
రామసముద్రం : మదనపల్లె మిషన్ కాంపౌండ్‌లో అక్టోబర్ 27న నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్జీఎఫ్ అండర్14, అండర్17 బాలికల హ్యాండ్‌బాల్ ఎంపికల్లో చెంబకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పూర్వి, భవ్య, జాహ్నవి, స్నేహ, చందన ప్రతిభ కనబరిచినట్లు హెచ్ ఎం రమేష్ బాబు తెలిపారు.నవంబర్‌లో ఏలూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు ఉమ్మడి చిత్తూరు జిల్లా హ్యాండ్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థినులను హెచ్ఎంతో పాటు ఎస్ఎంసీ చైర్మన్ సోమశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు దిలీప్‌కుమార్, మంజులమ్మ అభినందించారు.


