సామాన్యుల జీవితాలతో చంద్రబాబు ఆటలు | - | Sakshi
Sakshi News home page

సామాన్యుల జీవితాలతో చంద్రబాబు ఆటలు

Oct 28 2026 5:48 AM | Updated on Oct 28 2026 5:48 AM

వాల్మీకిపురం : నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి.. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే చరమగీతం ప్రారంభం కావాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీదేవి, మంచూరు ఎంపీటీసీ రామనాథం, మూరేవాండ్లపల్లి ఎంపీటీసీ సుహాసిని గెలుపుకోసం కష్టపడి పని చేయాలన్నారు. రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తూ, రాజ్యాంగం ప్రకారం పొందాల్సిన హక్కులకు భంగం కల్గిస్తున్న కూటమి పాలకుల దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మంచిని, ప్రస్తుత ప్రభుత్వం నిత్యావసర, బియ్యం ధరలు పెంచిన విధానాన్ని మహిళలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను ఫ్యాన్‌గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరాలని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు సువర్ణపరిపాలన అందించారన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. కూటమి నేతలు అవినీతి, దోపిడీకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పేదోడు పట్టెడన్నం తినాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాల్సిందేనని, దానికి స్థానిక సంస్థల ఎన్నికలతో నాంది పలకాలని సూచించారు. ప్రజలను నమ్మించి మోసగించిన కూటమికి ఓటుతో బుద్ధి చెబుదామన్నారు. ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి, సురేష్‌రెడ్డి, మదనమోహన్‌రెడ్డి, శివారెడ్డి, చలపతి, వెంకటరమణరెడ్డి, విజయ్‌కుమార్‌ నాయుడు, దేవేంద్రరెడ్డి, హరినాథ రెడ్డి, కరీముల్లా, రమేష్‌, గిరి, బివి రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, గోవర్థన, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement