మదనపల్లె సిటీ : 70వ ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల, బాలికల కరాటే, హ్యాండ్‌బాల్ జిల్లా జట్ల ఎంపికలు మంగళవారం స్థానిక ఆరోగ్యమాత స్కూల్, మిషన్ కాంపౌండ్ మైదానాల్లో జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. హ్యాండ్‌బాల్ బాలికల విభాగంలో అండర్–14, –17 విభాగాల్లో సుమారు 200 మంది బాలికలు పాల్గొన్నారు. వీరిలో అండర్ –17 విభాగంలో 16 మందిని ఎంపిక చేశారు. నలుగురిని స్టాండ్‌బైగా ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేష్‌బాబు తెలిపారు. అండర్–14 విభాగంలో 16 మందితోపాటు నలుగురిని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. కరాటేలో బాలికల విభాగంలో అండర్–17లో 11 మంది, అండర్ –17 బాలుర విభాగంలో 13 మందిని ఎంపిక చేశారు. అండర్–19 బాలుర విభాగంలో 13 మంది, అండర్–19 బాలికల విభాగంలో 11 మందిని ఎంపిక చేశారు. హ్యాండ్‌బాల్‌లో ఎంపికై న జట్లు గుంటూరులో త్వరలో జరగబోయే పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జయకృష్ణ, లానెన్స్, గురుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిపై దావా కొట్టివేత
పుంగనూరు : సోమల మండలం కందూరులో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిపై హక్కుల కోసం ప్రైవేటు వ్యక్తులు వేసిన దావాను పుంగనూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సురేష్ బాబు కొట్టి వేసిననట్లు ఏజీపీ సురేష్‌బాబు మంగళవారం తెలిపారు. కందూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 397/1లో 0.81 సెంట్లు, 397/2లో 2.20 సెంట్లు, సంత ప్రదేశం 0.50 సెంట్లు తమదేనని 2004లో జటాద్రయ్య, వారసులు సివిల్ దావా దాఖలు చేశారు. ఆ స్థలంలో ప్రభుత్వ, పంచాయతీని ఖాళీ చేయించి తమకు స్వాధీనం చేయాలని, బకాయి అద్దెలు చెల్లించాలని అందులో కోరారు. వీటిపై వాదనలు విన్న జడ్జి ప్రభుత్వ వాదనలతో సంతృప్తి చెంది దావాను కొట్టి వేశారని ఏజీపీ చెప్పారు.


