జగనన్న పాలనలో సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి | - | Sakshi
Sakshi News home page

జగనన్న పాలనలో సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

సాక్షి, మదనపల్లె : జగనన్న ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి అందించిన సంక్షేమం, ప్రతి పల్లెకు చేసిన అభివృద్ధి గురించి ఓటర్లకు తెలిసేలా ఎన్నికల్లో ప్రచారం చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. సోమవారం బి.కొత్తకోటలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్‌ఆర్‌సీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు, గ్రామస్థాయి నాయకులు, కార్యరక్తలతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని వేగవంతం చేయాలని కోరారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పథకాలు అమలు చేస్తారని ప్రజలు ఆశిస్తే.. అందుకు విరుద్ధంగా మోసం చేశారని అన్నారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాల లబ్ధి పొందని ఇల్లు, అభివృద్ధి లేని పల్లె అంటూ లేదని అన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు ప్రచారంలో ప్రజలకు తెలియజేయాలని, జగనన్న పాలన గుర్తు చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు పాగొండ ఖలీల్‌, సాంబశివ, జయరామి రెడ్డి, చిన్నికృష్ణ్ణ, అయూబ్‌, గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement