కారు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

గుర్రంకొండ : కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లె గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వట్టికుంట తిరుమలయ్య అనే వ్యక్తి ఆదివారం రాత్రి రోడ్డుపై నడుచుకొంటూ వస్తుండగా.. రాయచోటి నుంచి మదనపల్లె వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తిరుమలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో బాధితుడ్ని తిరుపతికి తీసుకెళుతుండగా.. మార్గంమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు.

హంద్రీ నీవా

కార్యాలయంలోకి ఉడా

సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని మార్పు చేశారు. జెడ్పీ అతిథి భవనంలో ఉన్న ఉడా కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. దాంతో ఉడా కార్యాలయానికి హంద్రీనీవా ప్రాజెక్టు సర్కిల్‌–3 కార్యాలయంలో గదులు కేటాయించారు. ఇక్కడికి కార్యాలయాన్ని తరలించి అధికారులు, ఇబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

పరుగు పందెంలో సత్తా

బి.కొత్తకోట (పెద్దతిప్పసముద్రం) : బి.కొత్తకోటలో టీవీ మెకానిక్‌గా పని చేసే పలుకూరి కాంతరాజ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 21.1 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌ సమీపంలోని హెచ్‌ఎండీఏ క్రీడా మైదానంలో జరిగిన ఈ పరుగు పందెంలో మొత్తం 1400 మంది పాల్గొన్నారు. 50 ఏళ్ల వయసు పైబడిన కేటగిరిలో పాల్గొన్న కాంతరాజ్‌రెడ్డి 21.1 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 3 నిమిషాల్లో అధిగమించి ఆరవ ర్యాంకు సాధించడంతో నిర్వాహకులు అతనికి మెడల్స్‌, పతకాలతో సత్కరించారు.

ఎయిడ్స్‌ నియంత్రణే లక్ష్యం

మదనపల్లె టౌన్‌ : ఎయిడ్స్‌ నియంత్రణ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ ఎల్‌.రాధిక సూచించారు. సోమవారం మదనపల్లె జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్‌టీ కేంద్రంలో ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్‌టీ సిబ్బంది, ఎన్జీవోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. క్లస్టర్‌ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్‌తో కలిసి రాధిక మాట్లాడుతూ 95–95–95 లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలన్నారు. హైరిస్క్‌ ప్రాంతాల్లో హెచ్‌ఐవీ పరీక్షా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement