‘స్థానిక’ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపిద్దాం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపిద్దాం

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

సాక్షి, మదనపల్లె : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ వర్గాల అభ్యర్థులను పార్టీలతో సంబంధం లేకుండా మద్దతు ఇచ్చి గెలిపించాలని పాల ఏకరి సంక్షేక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. సోమవారం మదనపల్లెలో కల్లూరి రాజేంద్ర ప్రసాద్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా పాల ఏకరి కులస్తులను గుర్తించి, వారికి బీ–ఫారాలు అందించిన రాజకీయ పార్టీలకు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా పాల ఏకరి, బీసీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఐకమత్యంతో విజయానికి కృషి చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. వైఎస్సార్‌సీపీ మదనపల్లె జెడ్పీటీసీ అభ్యర్థిగా జే.కిరణ్మయి పోటీ చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అడబిడ్డగా అందరూ మద్దతు తెలుపుతున్నామని అన్నారు. బీసీ మహిళలు రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించి అండగా నిలవాలని సమావేశం నిర్ణయించింది. బీసీలు ఎక్కడ పోటీలో ఉన్నా అండగా ఉండాలని తీర్మానించారు. అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. సమావేశంలో కల్లూరి రాజేంద్ర ప్రసాద్‌ నాయుడు, జన్నే రాజేంద్ర నాయుడు, జన్నే సురేంద్ర నాయుడు, గుర్రంకొండ మల్లికార్జున నాయుడు, ప్రసాద్‌ నాయుడు, మనిగే భాస్కర్‌నాయుడు, చలపతి నాయుడు, సిద్ధ భాస్కర్‌ నాయుడు, మన్నె శ్రీరాములు నాయుడు, పనసమాకులపల్లి నాయకులు, మేడిపల్లి చలపతి నాయుడు, రాజు, జె.కిరణ్‌, కొత్తపల్లి మహేష్‌, కదిరిపతి నాయుడు, రమణ, చలపతి, రామకృష్ణ, హరి పాల్గొన్నారు.

పాల ఏకరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement