మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో కాపురం ఉంటూ భూ కుంభకోణానికి పాల్పడిన కేసులో ఇటీవల అరెస్ట్ అయిన లేడీ డాన్ సులోచన అనుచరుడు కడియాల శ్రీరాములు నాయుడు ను సోమవారం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మోహన్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నీరుగట్టువారిపల్లికి చెందిన కోనేటి సులోచన, అనుచరుడు మోహన్‌ను ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదే కేసులో ఆమెకు ప్రధాన అనుచరుడు, రెడ్డప్ప నాయుడు కాలనీలో కాపురం ఉండే కడియాల శ్రీరాములు నాయుడు.. సులోచనతో చేతులు కలిపి, మదనపల్లి పట్టణ రూరల్ ప్రాంతాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.కోట్ల విలువైన భూములను వశం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దీంతో స్థానికంగా ఉండే బాధితులు వెంకటరమణారెడ్డి, మార్పూరి వెంకటేష్ నాయుడు కలిసి గతంలో అమ్మ చెరువుమిట్ట సమీపంలో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారన్నారు. వెంకటరమణారెడ్డికి వారసత్వంగా వచ్చిన రెండు ప్లాట్లు, భాగానికి వచ్చిన రెండు ప్లాట్లతో సహా మొత్తాన్ని సులోచన 2021లో వెంకటేశ్ నాయుడు సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందన్నారు. కోనేటి సులోచన తన అనుచరులతో కలిసి వెంకటరమణారెడ్డిపై తరుచూ గొడవలు పెట్టుకుని ఆయన్ను చంపుతామని బెదిరిస్తుండటంతో.. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోనేటి సులోచన, ఆమె తల్లి రెడ్డెమ్మ, సోదరుడు శ్రీనాధ్ అనుచరులు మోహన్, సీటీఎం రోడ్డులోని రెడ్డెప్ప నాయుడు కాలనీకి చెందిన కడియాల శ్రీరాములు నాయుడుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో సులోచన, మోహన్‌ను ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ పేర్కొన్నారు. అలా గే రెడ్డెమ్మ, శ్రీరాములు నాయుడు పరారీలో ఉండేవారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా శ్రీరాము లు నాయుడు పట్టుబడడంతో అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచడం జరిగిందని చెప్పారు. అలాగే రెడ్డమ్మ పరారీలో ఉందని ఆమెను కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఐ పేర్కొన్నారు. సులోచనతోపాటు శ్రీరాముల నాయుడు, మోహన్‌లపై వన్ టౌన్, టూ టౌన్, తాలూకా పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయని వివరించారు.


