గువ్వలచెరువు ఘాట్‌ లోయలో పడ్డ లారీ | - | Sakshi
Sakshi News home page

గువ్వలచెరువు ఘాట్‌ లోయలో పడ్డ లారీ

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

రామాపురం : మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశువుల దాణా లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో..

డ్రైవర్‌ దుర్మరణం చెందగా, క్లీనర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల పట్టణానికి చెందిన డ్రైవర్‌ జి.దాస్‌, అళ్లగడ్డ పట్టణానికి చెందిన క్లీనర్‌ మహబూబ్‌ బాషా లారీలో పశువుల దాణా తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సుమారు 7:30 గంటలకు గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో.. లారీ అదుపు తప్పి లోయలో పడి నుజ్జునుజ్జు అయింది. లారీ నడుపుతున్న డ్రైవర్‌ జి.దాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్‌ మహబూబ్‌ బాషాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. జి.దాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ మార్చురీకి తరలించారు. గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంతో విషాదం నెలకొంది.

డ్రైవర్‌ దుర్మరణం, క్లీనర్‌కు తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement