కురబలకోట : మదనపల్లి దగ్గర అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ద్వితీయ సంవత్సరం ఎఐ ఎంఎల్ బ్రాంచ్ విద్యార్థి సాయి ఫణి చరణ్ అరుదైన ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. తన చూపుడు వేలిపై పుస్తకాన్ని 2 గంటల 9 నిమిషాల పాటు ఆపకుండా తిప్పి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 2026 జూలై 6న మదనపల్లిలో నిర్వహించిన ఈ ప్రత్యేక ప్రయత్నంలో గతంలో ఉన్న ఒక గంట 49 నిమిషాల 25 సెకన్ల రికార్డును అధిగమించడం విశేషం. దీంతో లాంగెస్ట్ టైమ్ టు స్పిన్ ఏ బుక్ ఆణ్ ఇండెక్స్ ఫింగర్ (19 ఏళ్ల టీనేజర్) విభాగంలో రికార్డు సాధించారు. ఏకాగ్రత, పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనంగా నిలిచిన ఈ ఘనతపై యూనివర్సిటీ చాన్స్‌లర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్‌లర్ ఎన్.ద్వారకనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ల ఆదివారం అభినందనలు తెలిపారు.
చూపుడు వేలిపై పుస్తకాన్ని తిప్పడంలో దిట్ట
2 గంటల 9 నిమిషాలు తిప్పిన
సాయిఫణిచరణ్


