బొలెరో ఢీకొనిపెయింటర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బొలెరో ఢీకొనిపెయింటర్‌ దుర్మరణం

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

బొలెరో ఢీకొనిపెయింటర్‌ దుర్మరణం

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె మండలం సిటిఎం రోడ్డు గుడిసివారిపల్లె వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న అదే గ్రామంలోని దుబ్బిగానిపల్లెకు చెందిన రాజ్‌కుమార్‌(30) ను వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రోజంతా కష్టపడి ఇంటికి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం జరగడం స్థానికులను కలచివేసింది. స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు దుబ్బిగానిపల్లె రాజ్‌ కుమార్‌గా గుర్తిస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. బొలెరో డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement