సదుం: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి సూచించారు. మండలంలోని ఎర్రాతివారిపల్లెలో ఉన్న వారిని పలువురు నాయకులు శనివారం కలిశారు. ఎన్నికల సంబంధిత అంశాలపై చర్చించారు. అక్రమ కేసులతో వేధిస్తున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోయారు. ఆందోళన చెందాల్సిన పని లేదని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని చెప్పారు. ప్రజల మద్దతు పార్టీకే ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారంలో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, నారాయణ రెడ్డి, రమేశ్, ప్రసన్నకుమార్ రెడ్డి, ధనశేఖర్ రెడ్డి, ఇంద్రసేనా తదితరులు పాల్గొన్నారు.


