పిడుగుపాటుకు యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు యువకుడి మృతి

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

మదనపల్లె టౌన్‌/కురబలకోట : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం రిషి వ్యాలీ సమీపంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షంలో పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి మృతుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన అతావుల్లా కుమారుడు మాలిక్‌(28) వర్షం పడుతుండటంతో.. కురబలకోట మండలంలోని రిషి వ్యాలీ దగ్గరున్న తన వ్యవసాయ భూమిలోని చెట్టు చాటుకు వెళ్లి తలదాచుకున్నాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి చెందడంతో భార్య, పిల్లలు అనాథలయ్యారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బంధువులు, స్థానికులు మీడియా ముందు కోరారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement