అండగా ఉంటా.. | - | Sakshi
Sakshi News home page

అండగా ఉంటా..

Oct 23 2026 2:27 AM | Updated on Oct 23 2026 2:27 AM

● ఎవరూ భయపడవద్దు

● ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి

పుంగనూరు: పుంగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదని , పార్టీ కార్యకర్తల కోసం ఎంతటి త్యాగానికై న వెనుకాడేది లేదని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం గూండాలు చేస్తున్న విధ్వంస కార్యక్రమాలలో తాను , తన పార్టీశ్రేణులు తీవ్రంగా నష్టపోయినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా తెలుగుదేశం వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఎంిపీ మండిపడ్డారు. విధ్వంసం పొలీసులకు తెలియదా..? చట్టాన్ని ఇలాగేనా కాపాడేది అంటు నిలదీశారు. తెలుగుదేశం గూండాలకు అండగా ఉన్న పోలీసులపై కూడా న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు. తెలుగుదేశం వారిపై ఒక్క కేసు కూడ నమోదు చేయని పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసులు పెడతారా...? అంటు ప్రశ్నించారు. వందలాది మంది అమాయకులను బలిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement