వైఎస్సార్‌సీపీ నేత ఇల్లు కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత ఇల్లు కూల్చివేత

Oct 23 2026 2:21 AM | Updated on Oct 23 2026 2:21 AM

● బోయకొండలో దారుణం

● రూములు, దుకాణం ధ్వంసం

● రూ.50 లక్షల ఆస్తినష్టం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బోయకొండలో అరాచక పర్వం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, సర్పంచ్‌గా ఏదో ఒక పదవిని ఆశిస్తూ నామినేషన్‌ వేయడానికి సిద్ధమైన కాగతి పంచాయతీ పెద్దూరు కురప్పల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు జయచంద్ర ఇంటిని టీడీపీ నేతలు బుధవారం అర్ధరాత్రి జేసీబీతో పెకలించి నేలమట్టం చేశారు. బాధితుడు గురువారం తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయకొండలోని నిమ్మనపల్లె రోడ్డుమార్గంలో జయచంద్ర కొన్నేళ్లుగా ఇంటిని నిర్మించి యాత్రికులకు అద్దెకు రూములు ఇవ్వడం, చిల్లర దుఖాణం, సప్లయిర్స్‌ షాపు నిర్వహిస్తున్నాడు. వైఎస్సార్‌సీపీలో క్రీయాశీలకంగా ఉన్న అతను ఎన్నికల్లో పోటీకి సంసిద్ధం కావడంతో.. టీడీపీ నేతలు కొందరు కలిసి పథకం ప్రకారం ఇంటిని బుధవారం అర్ధరాత్రి వేళ నేలమట్టం చేశారు. నిత్యం ఇంటిలో నిద్రించే భార్యాభర్తలు ఆ సమయంలో ఇంట్లో లేకపొవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇంట్లో దాచిన నగదు రూ.3 లక్షలు, బంగారు 150 గ్రాములను సైతం దోచుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనంపై గోడలు పడి ధ్వంసమైందన్నారు. ఇంటి పరికరాలు, ప్రిడ్జ్‌లు, సామగ్రి, సప్లయర్స్‌ పరికరాలు, వంట సామగ్రి మొత్తం ధ్వసం చేశారని వాపోయారు. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ఘటనా స్థలానికి వచ్చిన ఎస్‌ఐ చిన్నరెడ్డెప్పకి విషయం తెలపగా.. ఘటనపై పట్టించుకోకపోగా నామమాత్రపు సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, కేసును సైతం తీసుకోలేదని వాపోయాడు. ఈ ఘటనపై ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్‌లో బాధితుడితో మాట్లాడారు. మదనపల్లెకు చేరుకొని ఘటనపై ఎంపీ ఆరా తీసి ఆదుకొంటామని భరోసానిచ్చినట్లు చెప్పారు. ఎన్ని దాడులు చేసినా తాను నమ్ముకొన్న నాయకుడు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంఽద్రారెడ్డి వెంటనే ఉంటానని, వారి మాటే తమకు శాసనం అంటూ మీడియాకు జయచంద్ర తెలిపాడు. కొందరు టీడీపీ నేతల వల్ల ప్రాణహాని ఉందని, ఈ ఘటనకు కారకులుగా అనుమానిస్తున్న వారిపై అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement