ములకలచెరువు : ములకలచెరువులో రెండో రోజూ పచ్చమూకలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకొన్నారు. నామినేషన్ కేంద్రంలోకి వెళ్లనీయకుండా బారికేడ్ల వద్ద బారీ సంఖ్యలో గుంపులుగా అడ్డుగా నిలబడ్డారు. సుమారుగా 10 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను లాక్కొని చించివేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎవ్వరినీ నామినేషన్లు వేయనీయకుండా అడ్డుపడ్డారు. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ అభ్యర్థులను సైతం లోపలికి పోనియ్యలేదు.
నామినేషన్ కేంద్ర వద్దకు ఎస్పీ, జేసీ
టీడీపీ పచ్చమూకల ఆగడాల సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మా ములకలచెరువు నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్లు వేయనియ్యకుండా అడ్డుకుంటున్న పచ్చమూకలను పోలీసు సిబ్బంది చెదరుగొట్టారు. నామినేషన్లను అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
12 నామినేషన్లు
ములకలచెరువు నామినేషన్ కేంద్రంలో రెండో రోజు గురువారం 12 నామినేషన్లు దాకలైనట్లు ఆర్‌ఓ కళ్యాన్ వెంకటేష్ తెలిపారు. బీజేపీ –2, జనసేన –3 టీడీపీ –7 వైఎస్సార్‌సీపీ నామినేషన్లు దాకలు కాలేదు. ఇప్పటి దాకా మొత్తం 36 నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.
బరితెగించిన పచ్చమూకలు


