ఎన్నికల ఫిర్యాదులకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఫిర్యాదులకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

● ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల

నోటిఫికేషన్‌ విడుదల

● జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

మదనపల్లి (కురబలకోట): అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం మదనపల్లి కలెక్టరేట్‌లో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సోమవారం తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే 85712 93001 నెంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంట్రోల్‌ రూమ్‌ నిర్వహణకు హౌసింగ్‌, మెప్మా పీడీలను నోడల్‌ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నేపధ్యంలో ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆదేశించినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో ముఖ్యంగా సున్నితమైన సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు. నామినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement